అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను పోలీస్ వ్యానులో తీసుకెళ్తున్నారు పోలీసులు. అసెంబ్లీ లోపలికి అనుమతించలేదని నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను పోలీస్ వ్యానులో తీసుకెళ్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే… కాంగ్రెస్ వస్తే.. పథకాలు గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. గల్లీ కాంగ్రెస్‌ది ఒక తీరు.. ఢిల్లీ కాంగ్రెస్‌ది మరొక తీరు అంటూ ఆగ్రహించారు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హై అంటాడని… గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని భాయ్ భాయ్ అంటున్నాడని మండిపడ్డారు. రాహుల్‌కేమో అదాని చోర్‌లాగా, రేవంత్‌కేమో భాయ్‌లాగా కనిపిస్తున్నాడు.. .అంటే.. ఇప్పుడు రాహుల్ గాంధీ కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? అంటూ సూటిగా ప్రశ్నించారు హరీశ్ రావు.