నవంబర్ 30న గండ్ర సత్యనారాయణను గెలిపించుకోవాలి – పొంగులేటి

-

నవంబర్ 30న గండ్ర సత్యనారాయణను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూపాలపల్లి లోని సింగరేణి కార్మికుల తో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…సింగరేణి కార్మికుల పేరు మార్పిడి సమస్య గురించి కవితకు చెపితే ఇప్పటివరకు కాలేదు… ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఐతే పెన్షన్ ఇస్తున్నారో అలాగే ఇచ్చేలా చేస్తామని వెల్లడించారు.

వారసత్వ ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే పైరవీలు చేసుకునే దుస్థితి వచ్చింది.. సింగరేణిని ప్రభుత్వం అప్పుల పాలు చేస్తోందని వివరించారు. నవంబర్ 30 వ తేదీన గండ్ర సత్యనారాయణరావుని గెలిపించుకోవాలని కోరారు. అటు తాము అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే డిసెంబర్‌ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని అన్నారు. ఒక్క అధికారిని సీఎండీగా ఇంతకాలం ఎందుకు కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ ప్రశ్నించారు. గనుల బిల్లుకు పార్లమెంట్‌లో బీఆర్ఎస్ మద్దతు తెలపలేదా? అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version