తీన్మార్ మల్లన్న గెలుపు ఎవరు ఆపలేరు – మంత్రి పొంగులేటి

-

తీన్మార్ మల్లన్న గెలుపు ఎవరు ఆపలేరన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఏమొఖం పెట్టుకుని BRS నాయకులు ప్రశ్నించే గొంతుకు ఓటేయాలని అడుగుతున్నారు…ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు గోలమాల్ పనులు చేసి వాళ్ళ అభ్యర్థి ని గెలిపించుకున్నారని పేర్కొన్నారు.

తీన్మార్ మల్లన్న పై 100 కేసులు ఉన్నాయని చెపుతున్నారు, వాటికి కారణం ఎవరు..అధికారం ఉంది అని దుర్వినియోగం చేసి ప్రశ్నిస్తున్నడని కేసులు పెట్టింది మీ ప్రభుత్వం లో అంటూ విరుచుకుపడ్డారు. ఒక్క కేసు కూడా నిలబడదని తెలిసి కేసులు పెట్టి కుటుంబాన్ని రోడ్డున నిలబెట్టారు….వ్యక్తి గత విమర్శలు చేసేముందు అవ్యక్తి ఎక్కడ తప్పు చేసాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. BRS పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు…మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలో కలిపిన మీకు ఓటు అడిగే హక్కు లేదు….ప్రజల కష్టాలను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version