2 రోజుల్లో ఆ పార్టీలో చేరుతా..బీఆర్ఎస్‌ అంతు చూస్తా – పొంగులేటి

-

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం నడిబొడ్డున ఆ పార్టీలో చేరతానంటూ వెల్లడించారు పొంగులేటి. లక్షలాది మంది సమక్షంలో ఆ పార్టీలో చేరతాను..కేసీఆర్ పరిపాలనను బొంద పెడతామని హెచ్చరించారు. మంచి పరిపాలన కోసము ప్రజాస్వామిక పార్టీలో చేరుతామని..కేసీఆర్ ను గద్దె దించాలంటే మన వంటి మైండ్ వున్న వారిని సమీకరించుకోవాలి…. అందుకనే నిర్ణయం ఆలస్యం అయ్యిందని చెప్పారు.

చాలా మంది తో చర్చలు జరిగాయని..చివరి ఆ పార్టీలో మరో రెండు రోజుల్లో చేరుతానని చెప్పారు పొంగులేటి. ఇవాళ తన అనుచరులతో సమావేశం అయ్యారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కురుక్షేత్ర యుద్ధం ప్రకటించి 5 నెలల దాటిందని వ్యాఖ్యానించారు. అనేకులు అవాకులు చవాకులు పేల్చారని మండిపడ్డారు.మీ గుర్తే మీకు తెలియదు అంటూ ఎగతాళిగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. కాలానికి అనుగుణంగా నేను నడుస్తానని… ఒక్క పార్టీలోనికి వెళతారని ప్రచారం జరిగినప్పుడు సంబరాలు చేసుకున్నారన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. కళ్లు ఉండి… కూడా చూడలేక పోతున్నారు. నా వంశ పారపర్యంగా నాదే అంటూ విర్ర విగుతున్నారని మండిపడ్డారు పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version