తెలంగాణ రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయం అన్నారు బండి సంజయ్. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
తెలంగాణ అభివ్రుద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శం అని ప్రకటించారు. తెలంగాణ అభివ్రుద్ధి, సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపట్ల మోదీగారికి ఉన్న అభిమానంతో తెలంగాణ అభివ్రుద్దిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు.
మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్దం. కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ స్వయంగా లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ విషయంలో సైంధవుడులా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్రం సహకరించలేదనడం సిగ్గు చేటు అంటూ పోస్ట్ పెట్టారు బండి సంజయ్.