జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి భారీ పాపులారిటీ దక్కించుకున్న బుల్లితెర బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే అప్పుడప్పుడు వివాదాల్లో కూడా తలదూరుస్తూ ఉండే అనసూయ అవకాశం దొరికితే చాలు కాంట్రవర్సీలకు గురి అవుతోంది. ఈ క్రమంలోనే కొన్నింటికి దూరంగా ఉండబోతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
అసలు విషయంలోకి వెళితే ఇటీవల విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తూ కొన్ని రకాల ట్వీట్ ల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఆమె మాట్లాడుతూ విజయ్ నేను ఒకప్పుడు మంచి స్నేహితుడుగా ఉండే వాళ్ళం కానీ కొన్ని కారణాలవల్ల మా వైద్య విభేదాలు వచ్చాయి అంటూ తెలిపింది.విజయ్ దేవరకొండకు నాకు ఎంతోకాలంగా పరిచయం ఏర్పడింది .ఆయన హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో కొన్ని అభ్యంతర పదాలను సెన్సార్ మ్యూట్ చేసింది .
ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండపలు థియేటర్స్ లో సందర్శించినప్పుడు సినిమాలో వినపడుకుండా చేసిన పదాలను అక్కడక్కడ ప్రేక్షకులతో కూడా పలకరించారు. ఒక తల్లిగా అది నన్ను మరింత ఇబ్బంది పెట్టింది. ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దని విజయ్ కి పర్సనల్ గా చెప్పాను. కానీ అప్పటినుంచే నాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత విభేదాలు పక్కన పెట్టి నేను విజయ్ దేవరకొండ నిర్మించిన నీకు మాత్రమే చెప్తా సినిమాలో కూడా నటించాను. అయితే విజయ్ కు సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ట్రోల్ చేయడానికి డబ్బులు కూడా ఖర్చు చేశారని విని షాక్ అయ్యాను. ఇదంతా విజయ్ దేవరకొండకు తెలియదా అంటూ ఆమె తెలిపింది. అందుకే ఇకపై అలాంటి వాటికి దూరం కాబోతున్నానని చెప్పింది.