సీఎం కేసీఆర్ తో పొన్నాల లక్ష్మయ్య సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు పొన్నాల లక్ష్మయ్య. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పొన్నాల లక్ష్మయ్య. ఈ తరుణంలోనే.. పొన్నాల ఇంటికి నిన్న మంత్రి కేటీఆర్ వెళ్లారు.
ఈ సందర్భంగా పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. పొన్నాల లక్ష్మయ్యకి బీఆర్ఎస్ లో కీలక పదవీ కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ నేతలను కాంగ్రెస్ పట్టించుకునే పరిస్థితి లేదని.. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని అణగదొక్కుతున్నారని విమర్శలు చేశారు పొన్నాల. ఇది బీఆర్ఎస్ కి అనుకూలంగా మార్చుకొని పొన్నాలను బీఆర్ఎస్ లో చేరాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఇక ఇందులో భాగంగానే.. ఇవాళ సీఎం కేసీఆర్ తో పొన్నాల లక్ష్మయ్య సమావేశం కానున్నారు.