సర్వేకు వచ్చిన అధికారులపై దాడి చేస్తే కఠిన శిక్షలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలసి మడ్ ఫోర్డ్ లో హాకీ గ్రౌండ్ ను స్పోర్ట్ కాంప్లెక్స్ రూపొందించడానికి గ్రౌండ్ ను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. లగచర్ల దాడి విషయం లో చట్టం తన పని తాను చేస్తుందని తెలిపారు.
కఠినంగా వ్యహరించాలని పోలీస్ శాఖ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సమగ్ర సర్వే పై అనుమానాలు వద్దు అన్నారు. సర్వే కు వచ్చే వారికి వివరాలు ఇవ్వడం, ఇవ్వక పోవడం మీ ఇష్టం అని తెలిపారు. కానీ సర్వే కు వచ్చిన అధికారుల పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఇక అటు సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు అయ్యాయి అంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శమిచ్చాయి.