తెలంగాణ నిరుద్యోగులకు షాక్..గ్రూప్-2 పరీక్షలు వాయిదా?

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ మేరకు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే నిన్న ఎన్నికలపై ప్రకటన చేయడంతో… తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ తో ఉద్యోగాల భర్తీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ రెండవ తేదీ మరియు మూడవ తేదీన జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్య ఈ పరీక్షలకు 50 వేల మంది సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పరీక్షలకు సిబ్బంది కేటాయింపు కష్టమని కలెక్టర్లు టిఎస్పిఎస్సికి ఇప్పటికే వెల్లడించారు. ఒకవేళ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడితే డిసెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news