తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. కేంద్ర సర్కార్ తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై విద్యుత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మహా దర్నాకు పిలుపు నిచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించారు.
దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులంతా మహా ధర్నా నిర్వహించనున్నారు. విద్యుత్ ఉద్యోగులంతా విధులకు హాజరు కాకపోతుండటంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఈ ప్రభావం ఉండనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక వేళ రాష్ట్రం అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పనురద్ధరించడటం కష్టం అవుతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.