ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం

-

పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా రద్దవుతున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున హైదరాబాద్ ప్రజాభవన్ లో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజావాణిని తాత్కాలిక రద్దు చేసినట్లు నోడల్ అధికారి దివ్య తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యాక జూన్ 7వ తేదీన ప్రజావాణి తిరిగి ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్టవ్యాప్తంగా లక్షా 85వేల మంది ఈ సౌకర్యానికి అర్హులని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version