42 హార్డ్ డిస్కులను అడవుల్లో పడేసిన ప్రణీత్ రావు

-

ఎస్ఐబీ కార్యాలయంలో ఆధారాల ధ్వంసం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ప్రణీత్‌రావు నుంచి అధికారులు కీలక సమచారం సేకరించారు. ఈ విచారణలో భాగంగా నిందితుడు ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కంప్యూటర్లకు సంబంధించి 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు చెప్పినట్లు వెల్లడించారు. హార్డ్ డిస్కులను వికారాబాద్ అడవుల్లో పడేసినట్లు తెలిపినట్లు చెప్పారు.

ప్రణీత్ రావుతో పాటు అతని కార్యాలయం బృందంలో పనిచేసిన సీఐనీ పిలిచి పోలీసులు విచారించారు. అతనితో పాటు పని చేసిన వారందరినీ ప్రత్యేక దర్యాఫ్తు బృందం విచారించనుంది. మరోవైపు ప్రణీత్ రావును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తుండగా.. స్టేషన్ గేట్లను మూసివేసి విచారణ కొనసాగిస్తున్నారు. స్టేషన్ లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఫోన్ ట్యాపింగ్, కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన ప్రణీత్రావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను కస్టడీకి కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా ఈ నెల 23 వరకు 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version