తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్

-

తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ గెలవబోతుందని పేర్కొన్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. రానున్న రోజుల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది కానీ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని కుండ బద్దలు కొట్టి చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు కానీ పోటీ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రం ఏ మాత్రం పోటీ లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చి చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.

కాగా, జమిలి ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షరతులతో కూడిన మద్దతును ఇస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం సరైన ఉద్దేశ్యంతో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అంగీకరిస్తామన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక వల్ల ఖర్చులు తగ్గిస్తాయని, ఓటర్లకు కూడా ఇబ్బందులు తగ్గవచ్చునన్నారు. భారత్ వంటి పెద్ద దేశాల్లో ఏడాదికి 25 శాతం మంది ఎన్నికల్లో ఓటు వేస్తుంటారని, జమిలి తీసుకువస్తే ఒకటి రెండుసార్లకే పరిమితమవుతుందని, ఇది ప్రయోజనకరమే అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version