ఆత్మహత్యకు ముందు ప్రవల్లిక నాకు ఫోన్ చేసింది: తండ్రి లింగయ్య

-

ఆత్మహత్యకు ముందు ప్రవల్లిక తనకు ఫోన్ చేసిందని ఆమె తండ్రి లింగయ్య చెప్పారు. ‘శుక్రవారం రాత్రి ఫోన్ చేసి అన్నం తిన్నావా? అని అడిగింది. గ్రూప్-2 పరీక్షలు మళ్ళీ వాయిదా పడ్డాయని బాధపడింది. ధైర్యంగా ఉండమని చెప్పా. నాతో మాట్లాడిన 20 నిమిషాలకే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది’ అంటూ లింగయ్య కన్నీరు పెట్టుకున్నారు. అయితే ప్రేమికుడు మోసం చేయడం వల్లే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

Pravallika Last Rites Complete

ఇది ఇలా ఉండగా…ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో మర్రి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు వెల్లడించారు. మర్రి ప్రవళిక 23, వరంగల్ జిల్లా బిక్కాజీ పల్లికి చెందిన అమ్మాయి గ్రూప్స్ కోచింగ్ కోసం.. అశోక్ నగర్ లోని బృందావన్ గల్స్ హాస్టల్ లో 15 రోజుల క్రితం జాయిన్ అయ్యిందని..ఆమెకు హాస్టల్లో శ్రుతి, సంధ్య అనే స్నేహితులు ఉన్నారు వారిని విచారించాము. నిన్న రాత్రి అమ్మాయి ఒక్కతే రూమ్లో ఉన్నపుడు చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version