రైతు భరోసా అనర్హత జాబితా సిద్ధం.. పంచాయితీల్లో డిస్ ప్లే..!

-

రైతు భరోసా అందని భూముల వివరాలను గ్రామాల వారిగా విడుదల చేయాలని ప్రభుత్వము భావిస్తోంది. త్వరలోనే వివరాలను పంచాయతీ ఆఫీసులలో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యంగా లేని భూములు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఈనెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6000 ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పంటలు పండించని భూముల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.

రైతు భరోసా స్కీం కింద రైతులకు నాగాదుబాదులు చేసే ముందు సాగుకు యోగ్యత లేని భూముల వివరాలను బహిరంగపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ జాబితాలో కొండలు గుట్టలు వెంచర్లు మైనింగ్ గానులు రోడ్లు ప్రభుత్వం వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాంటి భూముల వివరాలను గ్రామాల వారిగా స్థానిక గ్రామపంచాయతీ ఆఫీసుల్లో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదని.. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే సరిదిద్దే అవకాశం ఉంటుందని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈనెల 20 తర్వాత గ్రామాల వారిగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను పంచాయతీ ఆఫీసులలో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాం. దీంతో భూముల వివరాలు అందరికీ తెలుస్తాయని ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news