చంచల్‌గూడ జైలు అధికారులనే బురిడీ కొట్టిచ్చిన ఖైదీ..!

-

చంచల్‌గూడ జైలు అధికారులనే ఓ ఖైదీ బురిడీ కొట్టించాడు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ అయిన సుజాయత్ అలీ పరారీ అయ్యాడు. నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైల్ నుంచి పరారీ అయ్యాడు. ల్యాండ్ గ్రాఫింగ్ కేసులో రెండు నెలల క్రితం అరెస్ట్ అయ్యాడు సుజాయత్ ఆలీ. రెండు నెలల క్రితం 18 మంది సభ్యులతో కలిపి సుజాయత్ ఆలిని అరెస్ట్ చేసారు నార్సింగి పోలీసులు. రెండు నెలలుగా బెయిల్ రాకపోవడంతో జైలు నుంచి పరారీకి స్కెచ్ వేసాడు.

నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైలు నుంచి విడుదలై పోయాడు సుజాయత్ అలీ. అయితే సుజాయత్ అలీని కస్టడీ కోసం పిటిషన్ వేశారు నార్శింగి పోలీసులు. మరో కేసులో కస్టడీకి అనుమతించడంతో జైలుకు వెళ్లారు నార్సింగ్ పోలీసులు. జైలులో లేని సుజాయత్ ఆలీకి కస్టడీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు చంచల్ గూడ అధికారులు. కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్ పై విడుదల అయి వెళ్లిపోయారని చెప్పారు అధికారులు. బెయిల్ పత్రాలను తనిఖీ చేయగా నకిలీవని తేలడంతో కంగుదిన్నారు అధికారులు. సుజాయత్ అలీ రిమాండ్ ఖైదీ పరారీ కావడంతో డబర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేసారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version