జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లివస్తున్న ప్రైవేట్ బస్సు దగ్దం అయ్యింది. మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగాయి. సిరిసిల్ల నుండి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు భక్తులు వచ్చారు.

పుష్కర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్త్తు మంటలు చెలరేగి బస్సు దగ్దం అయ్యింది. ఘటన స్థలానికి రెండు అగ్ని మాపక యంత్రాలు చేరుకొని మంటలు సిబ్బంది ఆర్పింది. ఇక కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లివస్తున్న ప్రైవేట్ బస్సు దగ్దం అయిన సంఘటనలో ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారు.