ట్రాన్స్‌జెండర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. దివ్యాంగుల కోటాలో ట్రాన్స్‌జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్‌లోని సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్లను అభినందించారు మంత్రి సీతక్క.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తున్నాయన్న సీతక్క.. దివ్యాంగుల కోటాలో ట్రాన్స్‌జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.