సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రైవేట్ టీచర్లు

-

సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అతి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి పదవీని ఆశించిన వారిలో రేవంత్ రెడ్డి ఒకరూ. అయితే ఆయన ఇటీవలే ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాల్లో పని చేసే టీచర్లు ప్రమోషన్, బదిలీలు అయిన వారితో ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ టీచర్లను కొనియాడుతూనే.. ప్రైవేట్ టీచర్ల పై మండిపడ్డారు. మరోవైపు కేటీఆర్ పై కూడా సెటైర్లు వేశారు.

ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లు ఇంటర్ పాసైన వారు, డిగ్రీ ఫెయిల్ అయిన వారు అధికంగా ఉంటారని సీఎ: రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు ప్రైవేట్ టీచర్లు.  ఇంటర్ పాసైన, డిగ్రీ ఫెయిలైన వాళ్లే ప్రైవేట్ టీచర్లుగా పని చేస్తారా? ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలోనే చదువుతారు కదా..? వారికి ఫెయిలైన వాళ్లే చదువు చెప్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొవాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వాళ్లు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version