మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టనున్నారా అంటే చాలామంది అవుననే అంటున్నారు. మాదిగల రిజర్వేషన్ కోసం ఆయన పోరాటాలు ఫలించి సుప్రీమ్‌కోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్నునిచ్చింది. రాకీయాలకు అతీతంగా పోరాటం సాగించిన మందా కృష్ణ మాదిగ కష్టం ఫలించడంతో ఇక ఆయన రాజకీయ ప్రయాణం మొదలు పెడుతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఏ పార్టీ నుంచి ఆయన తన ప్రస్థానం మొదలు పెడతారనే చర్చలు ఊపందుకున్నాయి.
1999లోనే రిజర్వేషన్‌లు అమలు చేసిన చంద్రబాబు నాయుడు వెంట నడుస్తారా లేక కమలంలోకి జంప్ అవుతారా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరితోనూ మందా కృష్ణ మాదిగకు మంచి సంబంధాలు ఉన్నాయి. వర్గీకరణకు అనుకూలంగా రిజర్వేషన్‌లు కల్పించిన వ్యక్తి ఒకరైతే.. మరొకరు వర్గీకరణకు సంపూర్ణమద్ధతు ప్రకటించి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసిన పెద్దన్న ప్రధాని నరేంద్రమోడీ. అయితే ఇప్పుడు మందా కృష్ణ మాదిగ ఎవరివైపు వెళ్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది.
మాదిగల కోసం సాగించిన మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ మాదిగకు ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదురయ్యాయి. మాదిగలకు రిజర్వేషన్ అంశాన్ని కొందరు అణగదొక్కే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యాలయాలకు పిలిపించుకుని వార్నింగ్‌లు కూడా ఇచ్చారు.అయినప్పటికీ తన పోరాటాన్ని ఎప్పుడూ ఆపే ప్రయత్నం చేయలేదు మందా కృష్ణ. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరేవరకు కలిసివచ్చే పార్టీల సహాయం తీసుకుని పోరాటాన్ని సాగించారు.
ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీ వర్గీకరణకు తెలుగు రాష్ట్రాల్లో అనుకూలంగా ఉన్న చంద్రబాబు, కేంద్రంలో సపోర్ట్‌గా ఉన్న మోడీ హయాంలో ఈ తీర్పు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇన్నాళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటాలు చేసిన మందకృష్ణ పొలిటికల్ పార్టీ ద్వారా సామాజిక వర్గం అభ్యున్నతికి పాటుపడతారని తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన రాజకీయ ప్రయాణం మొదలు పెడతారని తెలుస్తోంది. దీనిపై ఇప్పుడు విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించిన భారతీయ జనతాపార్టీలో మందకృష్ణ మాదిగ చేరతారని ప్రచారం జరుగుతోంది. మొదటి ఆప్షన్‌గా ఆయన బీజేపీని ఎంచుకుంటారని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే ప్రకటించారు. దీంతో మాదిగలంతా బిజెపిని బలపరచాలని మందకృష్ణ పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం కావడంతో ఆయన బిజెపితో కలిసి సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ.
అందుకే మంద కృష్ణ మాదిగను చేర్చుకుంటే బలపడతామని అటు బిజెపి కూడా అనుకుంటోంది. 1999లో చంద్రబాబునాయుడు కూడా తెలంగాణలో మాదిగలను నమ్ముకునే అధికారంలోకి వచ్చిన సందర్భగాన్ని బీజేపీ ఇప్పుడు గుర్తుచేసుకుటోంది. ఒక ఏపీలో మాత్రం చంద్రబాబు వైపు మాదిగలు ఉండేలా ఇప్పటికే మందకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఎస్సీ వర్గీకరణకు అద్యుడు చంద్రబాబు కాబట్టి తీర్పు వెలువడిన వెంటనే ఆయన్నే గుర్తుచేసుకున్నారు మందాకృష్ణ. ఏపీలో మాత్రం మాదిగలు ఎప్పుడు టిడిపి పక్షమేనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇక తెలంగాణలో ఆయన బీజేపీలో చేరితేమాత్రం కాదనకుండా చేర్చుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై మందా కృష్ణ మాదిగ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.