రేపు ప్రొఫెసర్ కోదండరాం ఇల్లు ముట్టడి.. భారీగా పోలీస్ బందోబస్తు

-

తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు పర్మినెంట్ వీసీలను నియమించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ రేపు ప్రొఫెసర్ కోదండరాం ఇల్లును ముట్టడించనున్నట్లు తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ తెలిపారు. వీసీల పదవీ కాలం ముగిసి రెండు నెలలు గడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ తో చేతులు కలిపి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

కాగా రేపు ప్రొఫెసర్ కోదండరాం ఇల్లు ముట్టడిస్తుండటంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిన్న రాత్రంతా ఉస్మానియా యూనివర్సిటీలో DSC అభ్యర్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. డీఎస్సీ వాయిదా వేయాలని.. తమకు చదువుకోవడానికి సమయం కావాలంటూ ధర్నా చేశారు. తమ నిరసనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, తాము స్వచ్ఛందంగా ఆందోళన చేస్తున్నామని DSC అభ్యర్థులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version