ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని , మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే విద్యాశాఖలో ప్రమోషన్లు ఇస్తామని… ఉద్యోగులకు సరళమైన సర్వీస్ రూల్స్ ఉన్నాయని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్.
తెలంగాణ అనేక విషయాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో ఉందని.. జీఎస్డీపీలో తెలంగాణ ముందు వరసలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్నో నిందలు వేశారని.. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని ఆయన అన్నారు.
తెలంగాణ అంటే చాలా ఈర్ష్య పడుతున్నారని.. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కన్నా తెలంగాణ ముందు ఉందని ఆయన అన్నారు.ఒకప్పుడు మనకు కరెంట్ ఉండేది కాదని… ఎప్పుడు వస్తుందో తెలియదని అలాంటిది ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ గా తెలంగాణ ఉందని కేసీఆర్ అన్నారు.