ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. నేడు ED కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమం ఉంటుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఈ.డి కార్యాలయం ముందు నిరసన, ధర్నా కార్యక్రమం ఉండనుంది. ఈ ధర్నా లో ఏఐసీసీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, సీనియర్ నాయకులు
పాల్గొననున్నారు.

బీజేపీ, నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. నిన్న అన్ని జిల్లా కేంద్రాలలో DCC అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఇరికించారని నేడు ED కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను A1,A2 లుగా ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నారు.