తిరుపతిలో హైటెన్షన్..భూమన హౌస్ అరెస్ట్ !

-

తిరుపతిలో హైటెన్షన్..నెలకొంది. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ పరస్పర సవాళ్లు కొనసాగుతున్నాయి. ఉ.10 గంటలకు కచ్చితంగా గోశాలకు వస్తానంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇక కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

High tension in Tirupati Bhumana under house arrest

భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఎవరినీ హౌస్ అరెస్టు చేయలేదంటున్నారు పోలీసులు. సమాధానం చెప్పలేక హౌస్ అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని టీడీపీ విమర్శలు చేస్తోంది.

అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు భూమన. ఉ.10 గంటలకు గోశాలకు వస్తానని ప్రకటన చేశారు. ఉ.9 గంటలకు కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు గోశాల వద్దకు వస్తామని వెల్లదించారు. రేపు టీటీడీ గోశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని సమాచారం అందుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news