వాహనాల ఫిట్ నెస్ ఫైన్లను నిరసిస్తూ ఎల్లుండి అవి బంద్..

-

వాహనాలపై ఫిట్ నెస్ ఫైన్ లను నిరసిస్తూ ఎల్లుండి( మే 19న) తెలంగాణ లోని ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన రోడ్డు భద్రత చట్టాన్ని సాకుగా చూపించి వాహనాల ఫిట్నెస్ ఆలస్యమైతే రోజుకు రూ. 50 ఫైన్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బంద్ చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. డ్రైవర్లు అందరూ ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మే 19 న రవాణా శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. హేవీ గూడ్స్, ప్యాసింజర్ వెహికల్స్, మీడియా గూడ్స్, ప్యాసింజర్ వెహికల్స్, తేలికపాటి మోటార్ వెహికల్స్ ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ వాలిడిటీని వాహన రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ, వివరాలను కచ్చితంగా వెహికల్ పై నిబంధనలకు అనుగుణంగా డిస్ప్లే చేయాల్సి ఉంటుందని, లేదంటే రూల్స్ అతిక్రమించి నట్లే అవుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version