భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం…ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు !

-

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి పొలంలో ప్రియుడు పూడ్చి పెట్టాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో ప్రియురాలు స్వాతిని 3 రోజుల క్రితం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు ప్రియుడు వీరభద్రం.

BhaDradri Kothagudem district

సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ జంట దగ్గర నుంచి రూ. 16 లక్షలు తీసుకున్నారు స్వాతి వీరభద్రం. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయి ఆత్మహత్య చేసుకున్నారు బాధిత జంట. అయితే… ఈ తరుణంలోనే… ఈ రూ. 16 లక్షల విషయంలో స్వాతి వీరభద్రంకు మధ్య విబేధాలు జరిగాయట. ప్రియురాలు స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని దారుణంగా హత్య చేసిన ప్రియుడు….చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news