అసిఫాబాద్‌లో నీట్ పరీక్షలో మారిన క్వశ్చన్పేపర్

-

దేశవ్యాప్తంగా ఆదివారం రోజున నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులంతా ప్రశాంతంగా ఈ పరీక్షను రాశారు. అయితే కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్‌ పరీక్షలో మాత్రం గందరగోళం నెలకొంది. ఏకంగా విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నాపత్రం తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్‌ కాకుండా ఆసిఫాబాద్‌ మోడల్‌ స్కూల్లో పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరో ప్రశ్నపత్రం అందించారు ఇన్విజిలేటర్లు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేంద్రంలో 323 మందికి గానూ 299మంది పరీక్ష రాశారు. దీనిపై పరీక్ష నిర్వాహకులను వివరణ కోరగా…ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకురావలసిన పేపర్‌కు బదులు కెనరా బ్యాంకు నుంచి తెచ్చిన పేపర్‌ను విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. ఐతే, ఎన్టీఏ…ఈ-మెయిల్‌ ఆధారంగానే పరీక్ష పత్రం తీసుకువచ్చినట్లు వివరించారు. మరోవైపు తమ భవిష్యత్ ఏమవుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహిస్తే తమ సమయం వృథా కావడమే గాక.. ఇప్పుడు చదివినట్లు ప్రిపేర్ అవ్వగలుగుతామో లేదోనని వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version