బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఊహించని షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో ఉన్న లక్షన్నర నగదుతో పాటు.. అభరణాలు చోరీ చేశారట దొంగలు. దీంతో… ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పొన్నాల సతీమణి అరుణాదేవి.
దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. అయితే.. ఈ సంఘటన జరిగినట్లు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫ్యామిలీ ఇంట్లో లేదని సమాచారం. జనగామాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ*
- లక్షన్నర నగదుతో పాటు.. అభరణాలు చోరీ
- ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పొన్నాల సతీమణి అరుణాదేవి.
- కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు