తెలంగాణ రాజకీయాల్లోని రిజర్వేషన్లు టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేంద్రంలో ఇంకోసారి బిజెపి అధికారంలోకి మోడీ అమిత్ షా వస్తే ఎస్సీ ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని మోడీ అమిత్ షా మీద విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల మీద తాజాగా ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విషారదన్ మహరాజ్ సంచలన కామెంట్స్ చేశారు బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లు రద్దు చేస్తారని రేవంత్ అంటున్నారని నూటికి నూరు శాతం ఇది నిజం మేము ఎక్కిభవిస్తున్నాం.
ఇంతవరకు బానే ఉన్నా రేవంత్ రెడ్డి తన పాలనలో నాలుగు శాతం జనాభా ఉన్న రెడ్డిల కి 70% పైగా పదవులు అధికారం సంపద పెంచడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పదవుల పంపకం మీద కేసీఆర్ ఎందుకు రేవంత్ రెడ్డిని ప్రశ్నించట్లేదని తేల్చాలన్నారు.