బెంగళూరు కేఫ్ లో పేలింది బాంబు కాదు.. కాంగ్రెస్ మైండ్ : ప్రధాని మోదీ

-

కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్లో పేలింది బాంబు కాదని, కాంగ్రెస్ మైండ్ అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. బాంబు పేలుడుతో బెంగళూరు దద్దరిల్లితే, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పేలిందని బుకాయించిందని మండిపడ్డారు. ఆ పేలుడుకు పాల్పడిన వాళ్లంతా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలని తేలిందని మండిపడ్డారు. కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

“కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారతదేశ ఐటీ హబ్‌ బెంగళూరు బాంబులతో దద్దరిల్లింది. ప్రజలు భయాందోళనకు గురికావాల్సి వచ్చింది. కర్ణాటకను నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో అసాంఘిక శక్తులు, దేశ వ్యతిరేక ఆలోచనా విధానం కలిగిన సమూహాలకు మద్దతు లభిస్తోంది. మేము కర్ణాటకలో అధికారంలో ఉన్న సమయంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థలను బ్యాన్ చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలాంటి సంస్థలకు మళ్లీ కొత్త జీవితం లభించినట్లు అయింది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంటే, ప్రభుత్వం నడిపే అవకాశమే దక్కితే దేశ వ్యతిరేక శక్తుల భరతం పట్టడమే పనిగా పెట్టుకుంటుంది”. అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news