నిరుద్యోగులకు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అద్భుతమైన హామీలు..!

-

తెలంగాణలో నిరుద్యోగులకు బీఎస్పీ అద్భుతమైన హామీలను ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న అక్రమాల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. పేపర్ లీకేజ్, గ్రూపు-1 ఎగ్జామ్ ఇప్పటికే రెండు సార్లు పెడితే రెండు సార్లు రద్దు కావడం.. ఇలా చాలా అక్రమాలు జరుగుతుండటంతో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తాజాగా కొన్ని హామీలను ఇచ్చారు. వాటి గురించి మనం తెలుసుకుందాం.

1. BSP అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి రోజే అవినీతిలో కూరుకుపోయి, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన ప్రస్తుత TSPSC బోర్డును రద్దు చేస్తాం.

2. TSPSC పేపర్ లీకేజీ కేసును CBI కి అప్పగిస్తాం. పేపర్ లీకేజీలకు పాల్పడ్డ చైర్మన్, సభ్యులను, కీలక ఉద్యోగులను విచారించి చట్టప్రకారం శిక్షిస్తాం.

3. రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా TSPSC బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.

4. ప్రతి ఏడాది మెగా డీయస్సీ (DSC) తో సహా రాష్ట్రం లో ఖాళీలు ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.

5. TSPSC పరీక్షలో మాల్ ప్రాక్టిస్ కు పాల్పడ్డ వారిపై నేరాలు ఋజువైతే భవిష్యత్తులో సెంట్రల్ & స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయకుండా జీవితకాలం నిషేధం విధిస్తాం.

6. TSPSC బోర్డులో IAS/IPS లతోపాటు మేధావులు,విద్యావేత్తలు,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని మాత్రమే ఛైర్మెన్,బోర్డు సభ్యులుగా నియమిస్తాం.

7. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులకు TSPSC ఛైర్మెన్, బోర్డు సభ్యులుగా నియమించకుండా నిబంధనలను కఠినతరం చేస్తాం.

8. TSPSC ప్రశ్న పత్రాలను అత్యాధునిక బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పాటు ఎన్‌క్రిప్షన్ & డిక్రిప్షన్ టెక్నాలజీతో డేటాబేస్‌లో పేపర్ లీకేజీలకు తావులేకుండా నిక్షిప్తంగా భద్రపరుస్తాం.

9. TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు, రాజకీయ వివాదాలు,కోర్టు వివాదాలు లేకుండా, కట్టుదిట్టంగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి, పరీక్షలు నిర్వహిస్తాం.

10. TSPSC బోర్డులో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం.

11. TSPSC ఉద్యోగులపై నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తాం. ప్రత్యేక “ఇంటర్నల్ విజిలెన్స్” ఏర్పాటు చేస్తాం.

12. గ్రూప్ -I,II,III,IV ఉద్యోగాలకు వయోపరిమితి మరో 5 ఏళ్లు పెంచుతాం అని హామీలను ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news