ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

-

నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపుతోంది. ప్రతిపక్షంలో బలంగా వాణి వినిపించే నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదనే  విషయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎస్టీ శాసన సభ్యురాలు సీతక్క  హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సుమలత శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ములుగు నియోజకవర్గానికి నిధులు మంజూరైనట్టు శాంక్షన్ ఆడ్ ఇచ్చిన తర్వాత ఎందుకు నిధులు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నాలుగు వారాలు సమయం కావాలని కోరితే అందుకు హైకోర్టు తిరస్కరించింది.

అక్టోబర్ 9వ తేదీ నాడు జరిగే విచారణ నాటికి పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ములుగు ఎమ్మెల్యే నియోజవర్గానికి ఇవ్వలేదని ఆమె తరపు సీనియర్ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్, న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ వాదించారు.  వాదనల తర్వాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కల్పించుకుని పూర్తి వివరాలు సమర్పించేందుకు కనీసం నాలుగు వారాలు సమయం కావాలని కోరారు.

ఈ పరిస్థితుల్లో తిరిగి ప్రభాకర శ్రీపాద కల్పించుకుని నాలుగు వారాల సమయం ఇచ్చిన తర్వాత జరిగే విచారణ నాటికి అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు కావచ్చు అని చెప్పారు అంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని అభ్యంతరం చెప్పారు. దీంతో హైకోర్టు, పది రోజులు మాత్రమే సమయం ఇస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news