బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సిద్ధిపేట్ జిల్లాలోని గుడికందుల గ్రామంలో నిన్న జరిగిన ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన తీరు గురించి డీజీపీ మహేందర్ రెడ్డికి వివరించారు. కాగ నిన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… సిద్ధిపేట్ జిల్లాలోని తొగుట మండలం గుడి కందుల గ్రామంలో కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ – బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది.
దీంతో పోలీసులు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పాటు ఇరు పార్టీల కార్యకర్తలను అరెస్టు చేశారు. కాగ తనపై టీఆర్ఎస్ గుండాలు కావాలనే దాడి చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మార్కెట్ ను నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని అన్నారు. బీజేపీ సమావేశాలకే ఎందుకు ఇలా జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ సభలలో ఇలాగే జరుగుతుందా.. అని ప్రశ్నించారు.
అలాగే తనపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని ఆరోపించారు. తనకు అదనపు బందోబస్తు కోసం సీఐ, ఏసీపీ లకు చాలా సార్లు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోలేదని అన్నారు.