నా ఒంట్లో ఓపిక ఉన్నంతరకు పోరాడతానని ఓటమిపై రఘునందన్ రావు ఎమోషనల్ అయ్యారు. దుబ్బాక లో brs అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చేతిలో 45000 ఓట్ల తేడాతో ఓడారు రఘునందన్ రావు. ఇక ఈ ఓటమి పై రఘునందన్ రావు మాట్లాడుతూ సగం సగం తెలివి తో ఏమి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి పోలేదు..!! అతనికి ఆ రోజు కథన రంగంలో మృత్యువు పొంచి ఉంది అని తెలిసే వెళ్ళాడు..కానీ ఏదో చిన్న నమ్మకం తనవాల్లు తన వెంట ఉన్నారు అనే నమ్మకం అన్నారు.
వాళ్ళు అతన్ని అనుసరించడం లో విఫలం అయ్యారు..!! అది తెలిసి ఇంకా ముందుకు చొచ్చుకుపోతూ కౌరవ సేనని కకావికలం చేశాడు, కర్ణ దుర్యోధనాదులు ప్రాణ భయం చూపించాడు..!!చావు అయితే వచ్చింది గానీ వీరత్వం మాత్రం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది..!!ఒక్కసారి పని మొదలు పెట్టాక ఎంత ఇబ్బంది వచ్చినా దానిని విడువకూడదు మన ఒంట్లో ఓపిక ఉన్నంతరకు పోరాడాలి..!! ఎప్పుడు మనతో మన వాళ్ళు ఉండక పోవచ్చు లక్షల కౌరవ సేన మద్యలొ ఒంటరి అభిమన్యుడి గా నువ్వు మిగిలిపోవచ్చు..!! కానీ వెన్ను చూపక పోరాడిన వాడే చరిత్రలో తన పేరు ని రాస్తాడు..!! అంటూ ఎమోషనల్ అయ్యారు రఘునందన్ రావు.