మోదీలంతా దొంగలని రాహుల్ గాంధీ అనలేదని, మోసాలు చేసిన వారి పేర్ల చివరన మోదీ అనే సమీప్యత ఉందని మాత్రమే అన్నారని తెలిపారు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ పై అనర్హత వేటును నిరసిస్తూ ఆదివారం గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరువు నష్టం దావా కేసులు కోర్టుల్లో ఏళ్ల తరబడి నడుస్తాయని, కానీ రాహుల్ కేసు విచారణకు వచ్చిన నెల రోజుల్లోనే ఇలా తీర్పు ఇవ్వడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
అప్పిల్ కు అవకాశం ఉన్నప్పటికీ గంటల్లోనే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. ఇక దీక్ష సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఎప్పుడు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగారు. దీనికి స్పందించిన ఉత్తంకుమార్ రెడ్డి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం అయ్యేనాటికి మనం ఎంపీలుగా ఉంటామో లేదో అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు ముకుమ్మడి రాజీనామాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.