తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో రాహుల్ గాంధీ.. ఎక్కడి నుంచంటే?

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తే పార్టీపై మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందు సోనియా గాంధీ కూడా రాష్ట్ర నుంచి పోటీ చేయాలని రాష్ట్ర నేతలు భావించినా.. పలు కారణాల వల్ల ఆమె అందుకు అంగీకరించలేదు.

ఈ క్రమంలో రాహుల్‌గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ను ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. అందుకు ఆయా నేతలతో పాటు రాహుల్‌ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రాహుల్ ఖమ్మం లేదా భువనగిరి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news