మేడిగడ్డపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ కు కాలేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘తెలంగాణ సంపద దోపిడికి గురవుతోంది. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తాం. దోరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. BRS, BJP, MIM… మూడు ఒకటే’ అని రాహుల్ విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ = కేసీఆర్ కుటుంబం ATM.. తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని నేను సందర్శించానని ఈ ట్వీట్ లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. నాసిరకం నిర్మాణం కారణంగా పలు పిల్లర్లు పగుళ్లు ఏర్పడ్డాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్.. ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని చెప్పారు రాహుల్ గాంధీ. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజిపై దిగిన ఫోటోలను షేర్ చేశారు రాహుల్ గాంధీ.