తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరియు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేసింది.
హైదరాబాద్ మహానగరం, రంగారెడ్డి, జగిత్యాల, ములుగు, ఖమ్మం భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ , నల్గొండ, హనుమకొండ, యాదాద్రి, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మెదక్, వనపర్తి, అసిఫాబాద్, అదిలాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రెండు రోజులపాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచనలు చేసింది.