ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు మొదలవనున్నాయి. రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు, అలాగే కొన్నిచోట్ల భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ రోజు రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉండనున్నాయి.
ఇవాళ రాత్రి, రేపు తెల్లవారు జామున కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. మే 1, 2 తేదీలలో ఎక్కువ చోట్ల భారీ ఉరుములు, మెరుపులు పిడుగులు, వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 40-50 కి.మీ. వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.