హైదరాబాద్ లో వర్షం.. వానలోనే గణనాథుల నిమజ్జనం..!

-

హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభం అయింది. ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటంతో చాలా ఇబ్బందికరంగా మారింది. వర్షంలోనే ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల వర్షం కురుస్తోంది. బషీర్ బాగ్, ఎం.జే.మార్కెట్, హిామాయత్ నగర్,  ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ వంటి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షంలోనే గణనాథులు ట్యాంక్ బండ్ పైకి తరలివస్తున్నాయి.

వర్షంలోనే వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. విగ్రహాల తరలింపునకు ఆటంకం కలుగుతోంది. వర్షం వస్తున్నప్పటికీ కొందరూ వర్షంలోనే డ్యాన్స్ చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.  ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ముగిసింది.  నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన గణనాథుల నిమజ్జనం జరుగుతూనే ఉంది. దాదాపు శనివారం వరకు కూడా నిమజ్జనం జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అధికారులు కూడా అందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version