తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. నేటి నుంచే రైతు బంధు నిధులు విడుదల కానున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అద్భుత పథకం రైతుబంధు డబ్బులు నేటి నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. రైతుల ఆత్మహత్యలతో పాటు దిగుబడులను పెంచే ఉద్దేశంతో రూపొందించిన ఈ రైతుబంధు పథకం ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
సాగునీరు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వమే సమకూర్చుతుండటంతో అన్నదాతలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. 2018 సంవత్సరంలో ఊపిరి పోసుకున్న ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 10 విడతల్లో డబ్బులు జమయ్యాయి. ఇక ఈ సారి 70 లక్షల మంది రైతులకు రైతుబంధు అందనుంది. అటు లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన సుమారు 4 లక్షల ఎకరాలకు రైతుబంధు అందనుంది. ఈ వానాకాలం సీజన్ లో రైతుల ఖాతాలలో మొత్తం రూ.7720.29 కోట్లు జమకానుంది