రాజ‌కీయ వ్య‌భిచారం చేసే రేవంత్..భాగ్య‌ల‌క్ష్మి గుడికి రావొద్దు – కోమ‌టిరెడ్డి

-

రాజ‌కీయ వ్య‌భిచారం చేసే రేవంత్..భాగ్య‌ల‌క్ష్మి గుడికి రావొద్దని ఫైర్‌ అయ్యారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. రేవంత్ గ‌త చ‌రిత్ర ప్ర‌జ‌లంద‌రికీ తెల్సిందే. ప‌బ్లిక్ లో రేవంత్ కు బ్లాక్ మెయిల‌ర్ అనే పేరుంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్ ….. ఇప్పుడు భాగ్య‌ల‌క్ష్మి గుడి వ‌ద్ద ప్ర‌మాణాలంటే న‌మ్మేదెవ‌రని నిలదీశారు. లెక్క‌లేన‌న్ని త‌ప్పుడు ప‌నులు చేస్తున్న రేవంత్ భాగ్య‌ల‌క్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాల‌యం అప‌విత్రం అవుతుంద‌నేది భ‌క్తుల భావ‌న‌. రాజ‌కీయ వ్య‌భిచారం చేసే వ్య‌క్తి రేవంత్, త‌న స్వార్ధం కోసం భాగ్య‌ల‌క్షి గుడిని కూడా వాడుకోవ‌డం భావ్యం కాదన్నారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

టిడిపి ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన రాజకీయ వ్యభిచారివి నువ్వు కాదా రేవంత్. ఈటెల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారం చేయలేదన్నారు. కాంగ్రెస్ హైక‌మాండ్ పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కోవ‌డం ద్వారా రాజ‌కీయ వ్యభిచారానికి పాల్ప‌డింది నువ్వు కాదా రేవంత్ అని ఫైర్‌ అయ్యారు. కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్త‌వం కాదా, ఆమెతో నీకు వ్యాపార‌ భాగస్వామ్యం లేదా, ఓటుకు నోటు కేసులో ల‌క్ష‌ల రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌ల‌తో రెడ్ హాండెడ్ గా దొరికి జైలుకు వెళ్లిన నీ చరిత్ర రాజ‌కీయ వ్య‌భిచారం కాదా అని ప్రశ్నించారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version