రాజాసింగ్ కట్టర్ హిందూ.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణ బీజేపీ కీలక నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాసింగ్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ అని.. హిందూ సంస్కృతి ప్రమాదంలో పడిన ప్రతీసారి రాజాసింగ్ ప్రాణాలకు తెగించి పోరాడారని పేర్కొన్నారు.  ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం పై రాజాసింగ్ కీలక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. 

ముఖ్యంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయాలు నచ్చక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ కి బుజ్జగించేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగారు. పాతబస్తీలోని ఆకాశ్ పురి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి అనంతరం రాజాసింగ్ తో సమావేశం అయ్యారు. మళ్లీ తిరిగి బీజేపీ కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news