గుజరాత్ కి బ్రేక్ వేసిన లక్నో.. హ్యాట్రిక్ విజయం

-

ఐపీఎల్ లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ కి లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. ఏకనా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఓపెనర్ మార్క్రమ్ 31 బంతుల్లో 58 పరుగులు చేయగా.. వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ 34 బంతుల్లో 61 పరుగులు చేశారు. పూరన్ మరోసారి మెరుపులు మెరిపించాడు. మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో ఆడకపోవడంతో ఓపెనర్ గా వచ్చిన రిషబ్ పంత్ 21 పరుగులు చేశాడు. ఆయుష్ బదోనీ 28 రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. లక్నో కి ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. గుజరాత్ కి ఈ సీజన్ లో రెండో ఓటమి కావడం విశేషం. 

Read more RELATED
Recommended to you

Latest news