పేదవాళ్లు సన్న బియ్యం తింటుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపుమంటగా ఉన్నదని, కేటీఆర్ కు ప్రభుత్వంపై బురద జల్లాలని తప్ప ఇంకో పని లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు చామల.. ప్రతిపక్ష నాయకుల మాటలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లు కడుపునిండా అన్నం తినాలనే సత్సంకల్పంతో
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చెస్తోందని, పేదల కడుపు నిండుతుంటే.. ఈ బీఆర్ఎస్ పార్టీ
వాళ్లు వాళ్లు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. తమ హయాంలో సన్న బియ్యం ఇవ్వలేకపోయామని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఇస్తే.. ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తుందేమో అన్న భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వం మంచి పేరుతో ఎల్లప్పుడూ అధికారంలో ఉంటే తాము రాజకీయాలకు కూడా పనికిరామేమో అన్న భయం బీఆర్ఎస్ నేతల ను వెంటాడుతోందని దుయ్యబట్టారు.