ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముప్పు ఉందా..? అంటే అవును అనే చెబుతున్నారు స్థానికులు. యూనేస్కో గుర్తింపు పొందిన తరువాత రామప్ప అభివృద్దికి సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. చిన్నపాటి వర్షానికే రామప్ప దేవాలయం పై కప్పు నుంచి నీరు కురవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ప్రమాదపు అంచుల్లో ఉంది రామప్ప దేవాలయం. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తాం అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విడుదల చేయలేదు. రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఉపాలయాలకు పునరుద్ధరిస్తామని పురావస్తు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు.. నిధులు మంజూరు కాలేదు. దీంతో రామప్ప అభివృద్ధి నత్తనడకన సాగుతుంది. మరోవైపు రామప్ప ఆలయానికి ప్రస్తుతం ముంపు పొంచి ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వర్గానికి కురుస్తోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రామప్ప ప్రధానాలయానికి ఈశాన్యం వైపున ఉన్న రెండు పిల్లర్లతో పాటు పలు చోట్ల వర్షపు నీరు ఆలయంలోకి వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు ఆలయ పైకప్పుకు లీకేజీలు ఏర్పడి దేవాలయం వర్షపు నీటితో బురదమయంగా మారుతోంది.