Family Star: ఫ్యామిలీ స్టార్ టీజర్ కు ముహుర్తం ఫిక్స్

-

Family Star: పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే..ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హీరోయిన్ మృణాల్ ఇంకా విజయ్ మధ్య కెమిస్ట్రీ ఎంతో బాగుంది అంటూ టాక్ కూడా వచ్చింది. అయితే.. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్‌’ టీజర్‌ పై అప్డేట్‌ ఇచ్చారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ టీజర్‌ రేపు సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

https://x.com/TheDeverakonda/status/1764153827757080637?s=20

Read more RELATED
Recommended to you

Latest news