చట్నీలో ఎలుక.. క్లారిటీ ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపల్‌..!

-

సుల్తాన్ పూర్ JNTU ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో కదిలింది జిల్లా అధికార యంత్రాంగం. JNTU క్యాంపస్ కి వచ్చి విద్యార్థులనడిగి వివరాలు తెలుసుకున్నారు జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, RDO పాండు. ఫుడ్ లో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని వాపోయారు విద్యార్థులు. కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అడిషనల్ కలెక్టర్ మాధురి. వంట గదిలో కనీస జాగ్రత్తలు పాటించారా అని ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్ పై ఫైర్ అయ్యారు. మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ప్రిన్సిపాల్ కి ఆదేశించారు.

ముఖ్యంగా తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని నిరసనకు చేపట్టారు. హాస్టల్‌లో ఉన్న క్యాంటీన్‌లో చట్నీ ఉంచిన పాత్రపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. చట్నీలో ఎలుక ఈదుతుండటాన్ని గమనించిన విద్యార్థులు దానిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్‌ నరసింహ స్పందించారు. చట్నీలో ఎలుక పడలేదని.. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనించిందని తెలిపారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజా ప్రతినిధులకు పంపించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version