తెలంగాణలో గతేడాది రికార్డు స్థాయిలో మందుబాబులు మద్యం తాగేశారు. 2023లో రూ.36,151 కోట్లకుపైగా విలువైన 3.58కోట్ల కేసుల లిక్కర్, 5.34 కోట్ల కేసుల బీర్‌ను మందుబాబులు తాగారు. 2022లో కంటే దాదాపు రెండు వేల కోట్లు విలువైన మద్యాన్నిఅధికంగా మద్యం ప్రియులు తాగినట్లు ఆబ్కారీ శాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఉమ్మడి రంగారెడ్డిలో అత్యధికంగా మద్యాన్ని తాగిన జిల్లాగా రూ.8899.44 కోట్లు మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో రూ.3758.46 కోట్లు, వరంగల్‌లో రూ.3549.41 కోట్లు విలువైన మద్యాన్ని తాగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది.
జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో మాత్రం మూడు వేల కోట్ల కంటే తక్కువ విలువ చేసే మద్యం అమ్ముడు పోగా మిగిలిన అయిదు నెలల్లో మూడు వేల కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఆర్థిక ఏడాదిలో మద్యం ద్వారా బారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న గణాంకాలు ప్రకారం 36వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనాలు వేస్తోంది.