తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం కొనసాగుతోంది. ఈనెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండు రోజుల సెలవుల అనంతరం నిన్న నాల్గవ రోజు 20,39,927 దరఖాస్తులు వచ్చినట్లు సిఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
ఇప్పటివరకు నాలుగు రోజులకు కలిపి మొత్తం 61,16,167 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. నిన్న 1,866 మున్సిపల్ వార్డులు, గ్రామపంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని స్వీకరించామని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా… తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు పరిచింది. మిగతా హామీ అమలుపై ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే గత సర్కార్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలకు ముగింపు పలుకుతోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది.